News March 20, 2024
ఎన్నికల కోడ్ అమలుకు సమన్వయంతో పనిచేయాలి: శ్రీకాకుళం కలెక్టర్
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ విభాగాలు పొరపాట్లకు తావు లేకుండా పూర్తి సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. ఆర్ఓలు, ఈఆర్ఓలు, నోడల్ అధికారులు, ఎన్నికల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. సీ- విజిల్, సువిధ, ఎంసీసీ తదితర అంశాలను గమనించాలన్నారు.
Similar News
News January 15, 2025
సోంపేటలో పోలీస్ జాగిలాల విస్తృత తనిఖీలు
సోంపేట బస్ స్టేషన్, హోటళ్లు, కిరాణా షాపులలో బుధవారం సోంపేట సీఐ మంగరాజు ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. మాదకద్రవ్యాల రవాణా, నిషేధిత వస్తువుల కోసం ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీలలో పలువురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
News January 15, 2025
శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సినీ నటుడు
శ్రీకాకుళం మండలంలో అరసవల్లి గ్రామంలో ఉండే శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి సినీ నటుడు సాయి కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. స్వామిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ, శ్రీస్వామి వారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
News January 15, 2025
SKLM: ఈ నెల 20లోగా డోనర్ పాసులకు పేర్లు నమోదు ఆఖరి
వచ్చే నెల 4వ తేదీన అరసవల్లిలో జరగనున్న రథసప్తమి(సూర్య జయంతి) రోజున దాతలు దర్శనం చేసుకునే వారు డోనర్ పాసులకు పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో యర్రంశెట్టి భద్రాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవాలయానికి రూ.లక్ష పైబడి విరాళం సమర్పించిన దాతలు ఈ నెల 20వ తేదీ లోగా డోనర్ రసీదుతో పాటుగా ఆధార్ కార్డుతో ఆలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో సూచించారు.