News February 14, 2025
ఎన్నికల కోడ్ అమల్లో అప్రమత్తంగా ఉండాలి: NTR కలెక్టర్

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా అమలుచేయడంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు పోలింగ్ ఈ నెల 27న జరుగనున్న నేపథ్యంలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News July 9, 2025
వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News July 9, 2025
5 రోజుల్లో ‘తమ్ముడు’ షేర్ ఎంతంటే?

నితిన్ నటించిన ‘తమ్ముడు’ థియేటర్లలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. విడుదలైన 5 రోజుల్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రూ.75 కోట్లతో తెరకెక్కిస్తే థియేట్రికల్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోగా 12శాతమే రికవరీ అయినట్లు తెలిపాయి. దారుణమైన డిజాస్టర్ అని అభివర్ణించాయి. అంతకుముందు ‘రాబిన్ హుడ్’ కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
News July 9, 2025
23న సిద్దిపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

సిద్దిపేట జిల్లా కోహెడలో ఈ నెల 23న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హైమావతి మంగళవారం హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని పరిశీలించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 282 మహిళా సంఘాలకు గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ సామాగ్రి (స్టీల్ బ్యాంకు) పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.