News February 7, 2025

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: VZM SP

image

విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉంటుందని, పక్కాగా అమలయ్యేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ నేతల ఫొటోలు ఉండరాదన్నారు. ముఖ్యంగా బెల్టు షాపులు లేకుండా చూడాలని, విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News November 5, 2025

VZM: పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

image

ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు విశ్వవిద్యాలయంకి వెళ్లిన తనిఖీ బృందం గుర్తించింది. దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఏ.యూ స్పష్టం చేసింది.

News November 5, 2025

పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

image

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.

News November 4, 2025

VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

image

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.