News April 12, 2024

ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ. 4.55 కోట్లు సీజ్

image

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా రూ.1.71 లక్షల నగదు, రూ. 7.75 వేల విలువ గల మద్యం, 20, 000 విలువగల గంజాయి, రూ. 1.14 లక్షల విలువగల ఆభరణాలు, 86 లక్షల విలువగల ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో 75 లక్షల విలువగల మద్యం సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.4.55 కోట్లు సీజ్ చేశామన్నారు

Similar News

News November 6, 2025

నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 6, 2025

నల్గొండ: దూడకు రెండే కాళ్లు..!

image

తిప్పర్తి మండలం పజ్జూరులో రైతు జంజీరాల గోపాల్‌కు చెందిన గేదె రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. దూడకు కేవలం ముందు కాళ్లు మాత్రమే ఉన్నాయని, వెనుక కాళ్లు లేవని రైతు తెలిపారు. దూడ ఆరోగ్యంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.

News November 6, 2025

మిర్యాలగూడ: 100 గొర్రెలు మృతి

image

100 గొర్రెలు ఆకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వేములపల్లి మండలంలో జరిగింది. పెన్ పహాడ్ మండలానికి చెందిన గొర్ల కాపర్లు సైదులు, నాగరాజు, కోటయ్య, శ్రీరాములు, ఉపేందర్ మరో ఇద్దరు కలిసి గొర్లను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం వేములపల్లి శివారుకు చేరుకున్నారు. అక్కడే మేపుతుండగా ఒకేసారి గొర్లు చనిపోయాయని కాపర్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.