News February 7, 2025

ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: ASF కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో ఎస్పీ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పట్టబద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News March 17, 2025

ఖమ్మం: BC గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం

image

బీసీ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 9వ తరగతి (ఇంగ్లిషు మీడియం)లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీ.సీ గురుకుల ఆర్సీఓ సి.హెచ్. రాంబాబు తెలిపారు. ఆసక్తిగల బాల-బాలికలు 150 రూపాయల రుసుముతో ఈ 31లోగా https://mjptbcadmissions .org/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 17, 2025

ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

image

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

News March 17, 2025

రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.

error: Content is protected !!