News April 11, 2024

ఎన్నికల కోడ్.. 8కిలోల వెండి సామగ్రి పట్టివేత

image

ఎన్నికల నేపథ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈరోజు రాజాం మండలం జెండాల దెబ్బ సమీపంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు చేపట్టిన తనిఖీలలో భారీగా వెండి సామగ్రి పట్టుబడింది. విజయనగరం నుంచి టూ వీలర్ మీద రాజాం వస్తున్న ఒక వ్యక్తి వద్ద సుమారు రూ.5 లక్షల విలువ చేసే 8కిలోల వెండి సామగ్రి లభ్యమైంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 15, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 365 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

image

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శనివారం 365 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ పి దుర్గారావు శనివారం తెలిపారు. 17,452 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 17,087 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన వివరించారు. 

News March 15, 2025

ఎచ్చెర్ల : రోడ్డు ప్రమాదంలో చెన్నై వాసి మృతి

image

జరజాం జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బి.ఆకాశ్(35) శ్రీకాకుళం నుంచి విశాఖకు కారులో వెళ్తూ.. జరజాం జంక్షన్ సమీపంలో ముందువెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవ్ చేస్తున్న ఆకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 15, 2025

ఉదయపురంలో వింత గొర్రె పిల్ల జననం

image

కోటబొమ్మాళి మండలం ఉదయపురం గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. కూస భీమారావుకి చెందిన గొర్రెకి వింత జీవి జన్మించింది. పశువైద్యాధికారి డా. లఖినేని కిరణ్ కుమార్ వివరాలు.. శుక్రవారం ఓ గొర్రెకు శస్త్ర చికిత్స చేసి పిల్లను బయటకు తీశారు. ఇలా వింత పిల్లలు పుట్టడాన్ని ఫీటల్ మాన్స్టర్ అంటారని డాక్టర్ వివరించారు. ఆ గొర్రెపిల్ల చనిపోయినట్లు తెలిపారు. దానిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.

error: Content is protected !!