News February 26, 2025

ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన WGL కలెక్టర్

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ సత్య శారద సందర్శించారు. 6 రూట్స్ ద్వారా 13 కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని పంపనున్నారు. పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వాహనాల్లో వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రతిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Similar News

News September 18, 2025

పామిడిలో తండ్రిని చంపిన కొడుకు

image

పామిడిలోని బెస్తవీధిలో తండ్రిపై కొడుకు రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. దాడిలో తండ్రి సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

సిరిసిల్ల కలెక్టర్‌పై వారెంట్ జారీ..!

image

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు వారెంట్ జారీ చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది బొమ్మన అర్జున్ తెలిపారు. ఏమైందంటే.. మిడ్ మానేరులో ఇంటిని కోల్పోయిన చీర్లవంచకు చెందిన వేల్పుల ఎల్లయ్య నష్టపరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అతడికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినా దీనిపై కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరించారు. పైగా వివరణ కోసం కోర్టుకూ హాజరుకాలేదు. దీంతో ఆయనపై వారెంట్ జారీ అయింది.

News September 18, 2025

మాసాయిపేట: ట్రావెల్స్ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

image

మెదక్ జిల్లా మాసాయిపేటలో హైవే-44పై జరిగిన <<17746368>>రోడ్డు ప్రమాద<<>> ఘటనలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ఉన్న UPకి చెందిన రాజ్ కుమార్ పాల్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.