News May 4, 2024
ఎన్నికల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల తనిఖీల్లో రూ.18.09 లక్షల నగదు, రూ. 49,681 విలువ చేసే 89.635 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్ వన్ టౌన్, టూ టౌన్, ఫోర్త్ టౌన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 4 కేసుల్లో నగదు, నిజామాబాద్, ఆర్మూర్ బోధన్ డివిజన్లలో 6 కేసుల్లో మద్యం పట్టుకున్నట్లు సీపీ వివరించారు.
Similar News
News November 13, 2024
టీయూ: డిగ్రీ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులై/ఆగస్టులో జరిగిన డిగ్రీ కళాశాలల పరీక్షల ఫలితాల రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు తమ కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.అరుణ తెలిపారు. డిగ్రీ 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్స్ బ్యాక్ లాగ్స్ కోసం వన్ టైం ఛాన్స్ కింద అవకాశం ఇచ్చామన్నారు. వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సందర్శించాలని కోరారు.
News November 13, 2024
నిజామాబాద్ జిల్లాలో పలు రైళ్లు రద్దు
మంగళవారం రాత్రి పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. నిజామాబాద్-కాచిగూడ, గుంతకల్లు, బోధన్, కరీంనగర్-బోధన్ మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
News November 13, 2024
జక్రాన్‌పల్లి: నిప్పు అంటుకొని వృద్ధుడు మృతి
ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని వృద్ధుడు మృతి చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన నడిపి గంగాధర్ (67) సోమవారం ఇంట్లో మంచంపై పడుకుని బీడీ తాగుతుండగా బీడీకి ఉన్న నిప్పు రవ్వలు మంచంపై పడ్డాయి. దీంతో మంచం కాలిపోయి గంగారం తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.