News January 31, 2025

ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయాలి: కలెక్టర్ 

image

ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ఈసీఐ విడుద‌ల చేసిన నేప‌థ్యంలో జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ) ప‌టిష్ట అమ‌లుకు అధికారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై ఆర్‌డీవోలు, త‌హ‌శీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు త‌దిత‌రుల‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. 

Similar News

News November 2, 2025

డేవిడ్, స్టాయినిస్ దూకుడు.. ఆస్ట్రేలియా స్కోర్ ఎంతంటే?

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా 186/6 రన్స్ చేసింది. టిమ్ డేవిడ్ (38 బంతుల్లో 74), స్టాయినిస్ (39 బంతుల్లో 64) వీరవిహారం చేశారు. వీరిద్దరూ కలిసి 7 సిక్సర్లు, 16 ఫోర్లు బాదారు. చివర్లో షార్ట్ (26*) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్ 2, దూబే 1 వికెట్ తీశారు.

News November 2, 2025

చెన్నేకొత్తపల్లి: హైవేపై ప్రమాదం.. ఒకరి మృతి

image

చెన్నేకొత్తపల్లి మండలం కేంద్రం సమీపాన కోణ క్రాస్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రావుల సోమశేఖర్ అనే యువకుడు బైకుపై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీకేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.

News November 2, 2025

HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

image

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.