News April 7, 2024
ఎన్నికల నియమావళిని పాటించాలి: సబ్ కలెక్టర్
కందుకూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి శనివారం సమావేశం నిర్వహించారు. నేతలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పార్టీ కరపత్రాలపై ప్రింటింగ్ ప్రెస్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయించాలన్నారు. కందుకూరులో 55 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను గుర్తించి భద్రత పెంచామని సబ్ కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 24, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను కలిసిన మహిళా ఉద్యోగులు
ఏపీ JAC అమరావతి మహిళా విభాగం ప్రకాశం జిల్లా చైర్ పర్సన్ జయలక్ష్మి గురువారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, వారు పనిచేసే చోట వాష్ రూమ్స్ ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అసోసియేషన్ భవనం ఏర్పాటు చేయుటకు పట్టణంలో స్థలం కేటాయించవలసిందిగా అర్జీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జయలక్ష్మి తెలిపారు.
News January 24, 2025
ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి గుణాత్మక విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు అన్నారు. గురువారం ఒంగోలులో జరిగిన ప్రకాశం- నెల్లూరు జిల్లాల విద్యాశాఖ అధికారుల, ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. గతంలో ప్రభుత్యం జారీ చేసిన జీవో 117ను మారుస్తూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.
News January 23, 2025
డిప్యూటీ CMతో బాలినేని భేటీ
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రాజకీయ అంశాలపై సమాలోచనలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.