News February 26, 2025
ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: MHBD ఎస్పీ

ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 150 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఎస్పీ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 1663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.
Similar News
News December 3, 2025
నేడు AP TET హాల్టికెట్లు విడుదల

AP: TET 2025 పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు నేడు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఈ పరీక్షలు డిసెంబర్ 10 నుంచి CBT విధానంలో రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. సెషన్-I ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, సెషన్-II మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ లాగిన్ వివరాలు ఉపయోగించి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
News December 3, 2025
VZM: ‘64 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు’

విజయనగరం పట్టణంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 66 మంది వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు విచారణలో 64 మందికి రూ.10,000 చొప్పున జరిమానా.. ఇద్దరికి వరుసగా 2 రోజులు, 5 రోజుల జైలు శిక్ష విధించామని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనం నడపకూడదని, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
News December 3, 2025
ఏ పాఠశాలలోనూ ఫ్లెక్సీలు కట్టరాదు: బాపట్ల కలెక్టర్

పాఠశాలలకు మంజూరైన పరికరాలు, ఆట వస్తువులన్నింటిని పీటీఎం కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను పీటీఎంకు ఆహ్వానించాలన్నారు. ఏ పాఠశాలలోనూ ఫ్లెక్సీలు కట్టరాదన్నారు. పదో తరగతి పరీక్షల్లో 100శాతం విద్యార్థుల ఉత్తీర్ణత ఉండాలన్నారు. విద్యార్థుల సామర్థ్యం గుర్తించే సమయంలో నిర్దిష్ట జాగ్రత్తలు పాటించాలని, అపార్ ఐడీ నూరు శాతం నవీకరణ చేయాలన్నారు.


