News February 26, 2025

ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: MHBD ఎస్పీ

image

ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా 150 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి ఎస్పీ సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 1663 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు.

Similar News

News March 19, 2025

మెదక్: యువకుడి సూసైడ్

image

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండలంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గరుగుల భాను(19) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2025

సంగారెడ్డి: పాఠశాలలపై చర్యలు: డీఈవో

image

జిల్లాలో ఈనెల 15 నుంచి ప్రారంభమైన హాఫ్‌డే స్కూల్స్ నడుపని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల ఒంటి పూట బడులు నడపడం లేదని, పూర్తి రోజు పాఠశాలలను నడిపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 19, 2025

సంగారెడ్డి: రేపు పోలీస్ స్టేషన్‌లకు పది ప్రశ్నాపత్రాలు

image

పదో తరగతి సెట్-2 ప్రశ్నాపత్రాలు బుధవారం పోలీస్ స్టేషన్‌లకు చేరుకుంటాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు డబుల్ లాక్డ్ ట్రంక్ బాక్స్‌లతో ఉదయం 10 గంటలకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

error: Content is protected !!