News February 11, 2025
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: KMR కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని KMR జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సోమవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు.
Similar News
News December 12, 2025
పిఠాపురం తీరుపై ప్రజల్లో అసంతృప్తి

పిఠాపురం నియోజవర్గానికి నియమించిన ఫైవ్ మెన్ కమిటీపై అసంతృప్తి మొదలైంది. సభ్యుల్లో ఎంపీ ఢిల్లీ లేదా కాకినాడకు పరిమితం. తుమ్మల బాబు పెద్దాపురం డీసీసీబి ఛైర్మన్‌కే పరిమితం. కిశోర్, జ్యోతుల శ్రీనివాస్‌లకు క్యాడర్‌తో పరిచయం లేదు. కేవలం దొరబాబు ఒక్కరే అందుబాటులో ఉన్నా ఆయనకి అధికారాలు లేవని క్యాడర్ చెబుతున్నట్లు టాక్. దీంతో ఒక్క ఇన్ఛార్జ్నే పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News December 12, 2025
బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన <<18539765>>బస్సు ప్రమాద<<>> స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.
News December 12, 2025
వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ పోరాడుతోంది: పావెల్

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ తన మనుగడ కోసం పోరాడుతోందని ఆ దేశ క్రికెటర్ రోవ్‌మన్ పావెల్ అన్నారు. గతంలో ఆట ఎలా ఉన్నా ఇప్పుడు బాగా ఆడితే ఏ టీమ్ అయినా బాగానే కనిపిస్తుందని చెప్పారు. IPL 2026 మెగా వేలానికి ముందు KKR లాంటి ఫ్రాంచైజీ రూ.1.85 కోట్లకు తనను రిటైన్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సునీల్, రస్సెల్, బ్రావో ఉన్న టీమ్‌లో ఆడటం హోమ్ టీమ్‌లో ఆడుతున్నట్టే ఉంటుందని చెప్పారు.


