News February 9, 2025
ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి: మంచిర్యాల కలెక్టర్

జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 8, 2025
‘అఖండ-2’ విడుదలపై క్లారిటీ అప్పుడే?

‘అఖండ-2’ను ఈ నెల 12న విడుదల చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే డిసెంబర్ 25కు రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. 12న విడుదలైతే వచ్చే వారంలో ‘అవతార్-3’ రిలీజ్ ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈరోస్ సంస్థతో వివాదం విషయమై రేపు క్లారిటీ రానుందని, ఆ తర్వాతే రిలీజ్ డేట్‌పై ప్రకటన వస్తుందని వెల్లడించాయి.
News December 8, 2025
పల్నాడు: ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్ తనిఖీలు

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట పట్టణాల్లోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా పురుగుమందులు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా అవుతున్న భారీ మొత్తంలో పురుగుమందులను స్వాధీనం చేసుకుని, విచారణ చేపట్టారు.
News December 8, 2025
ఉమ్మడి వరంగల్‌లో 3వ దశలో 15,827 నామినేషన్లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ దశలో పోటీ చేసేందుకు సర్పంచ్ 3515, వార్డులకు 12312 నామినేషన్లు దాఖలయ్యాయి.
★వరంగల్‌లో 109 జీపీలకు 624, 946 వార్డులకు 2502
★ములుగులో 46 జీపీలకు 209, 408 వార్డులకు 926
★భూపాలపల్లిలో 81 జీపీలకు 470, 696 వార్డులకు 1649
★మహబూబాబాద్‌లో 169జీపీలకు 1185, 1412 వార్డులకు 3592
★హనుమకొండలో 68 జీపీలకు 514, 634 వార్డులకు1780,
★జనగామలో 91జీపీలకు 513, 800 వార్డులకు 1863 నామినేషన్లు


