News February 9, 2025
ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి: మంచిర్యాల కలెక్టర్

జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 19, 2026
GNT: నాగార్జున వర్సిటీలో లాసెట్ ఉచిత శిక్షణ

ఏపీ లాసెట్ (ఐదేళ్ల కోర్సు) అభ్యర్థులకు ఆచార్య నాగార్జున వర్సిటీ ఉచిత శిక్షణ అందిస్తోంది. ఏప్రిల్ 16న ప్రారంభమైన ఈ తరగతులు మే 2 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు నిపుణులతో కోచింగ్ ఇస్తారు. మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తామని న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 19, 2026
PM మోదీ ప్రోత్సాహం నాకు బలం: పవన్

AP: తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న <<19688324>>PM మోదీకి<<>> Dy.CM పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘నాతో మాట్లాడేందుకు సమయం కేటాయించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన విషెస్, మీరిచ్చే ప్రోత్సాహం నాకు గొప్ప బలాన్నిస్తాయి. మీ మద్దతు, మార్గదర్శకత్వానికి కృతజ్ఞుడినై ఉంటా’ అని పవన్ ట్వీట్ చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలని CM CBN, మంత్రి లోకేశ్, మాజీ సీఎం జగన్, KTR తదితరులు Xలో పోస్టులు పెట్టారు.
News April 19, 2026
కడప: మీ పిల్లలకు వినికిడి సమస్య ఉందా.?

వినికిడి సమస్య ఉన్న ఎందరో చిన్నారుల జీవితాలు చిన్నాభిన్నం కాకుండా TTD ‘శ్రవణం’ పేరుతో కాపాడుతోంది. సాంకేతికతతో <<19688732>>చెవుడు<<>>ను పోగొట్టవచ్చు. ఇది తెలియని తల్లిదండ్రులు తమ చిన్నారుల విషయంలో నష్టపోతున్నారు. వీరి కోసమే TTD 2006 నుంచి తిరుపతిలోని ఓల్డ్ మెటర్నిటీ ఆసుపత్రి భవనంలో శ్రవణం ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు 14 వందల మంది చిన్నారులకు సమ్యను దూరం చేశారు.
# SHARE IT.


