News May 12, 2024

ఎన్నికల ప్రక్రియకు 450 ఆర్టీసీ బస్సులు

image

NLR: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు 450 బస్సులకు కేటాయించినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పీవీ శేషయ్య తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు సాగించడంతో పాటు ఈవీఎంల తరలింపునకు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ్ ఆదేశాల మేరకు బస్సులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బస్సులను నడపనున్నట్లు వివరించారు.

Similar News

News December 15, 2025

కాకాణి రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్పందన

image

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో తనపై నమోదు చేసిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖాలు చేశారు. గతంలో దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎంకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసి.. ప్రతివాదుల స్పందన అనంతరం విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకొనేందుకు హైకోర్ట్ 8 వారాలు వాయిదా వేసినట్లు కాకాణి ఒక ప్రకటనలో తెలిపారు.

News December 15, 2025

ఆస్తి కోసం వేధింపులు.. కొడుకుపై ఎస్పీకి వృద్ధురాలి ఫిర్యాదు

image

ఇందుకూరుపేటకు చెందిన ఓ వృద్ధురాలు సోమవారం ఎస్పీని కలిసి తన కుమారుడిపై ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు కుమారులకు ఆస్తిని సమానంగా పంచి, తాను వేరుగా ఓ ఇంట్లో భర్తతో ఉంటున్నట్లు తెలిపింది. అయితే ఆ ఇంటిని కూడా ఇవ్వాలంటూ తన కొడుకు వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన భర్తను బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు ఎస్పీని కోరారు.

News December 15, 2025

నెల్లూరులో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

image

నెలూరులో సోమవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్ యాదవ్ తదితర నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ.. వాజ్‌పేయి చేపట్టిన సంస్కరణలు దేశాభివృద్ధికి బలమైన పునాది వేశాయని కొనియాడారు.