News May 12, 2024
ఎన్నికల ప్రక్రియకు 450 ఆర్టీసీ బస్సులు

NLR: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు 450 బస్సులకు కేటాయించినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పీవీ శేషయ్య తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు సాగించడంతో పాటు ఈవీఎంల తరలింపునకు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ్ ఆదేశాల మేరకు బస్సులను అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బస్సులను నడపనున్నట్లు వివరించారు.
Similar News
News April 18, 2026
హైకోర్టు జడ్జిని కలిసిన నెల్లూరు SP

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నెల్లూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ కే.సురేశ్ రెడ్డిని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లాలోని అన్ని కోర్టుల న్యాయాధికారులతో డిస్టిక్ కోర్టులో వర్క్ షాప్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలో న్యాయ పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ తరఫున తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
News April 18, 2026
పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు ఇవే…

☞ ఏప్రిల్ 28న: ధ్వజారోహణం, శేష వాహ సేవ ☞29న: బంగారు హనుమంత సేవ ☞ 30న: బంగారు గరుడసేవ ☞మే 1న: కళ్యాణోత్సవం, రథోత్సవం ☞2న: వసంతోత్సవం, అశ్వవాహన సేవ ☞3న: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ.
News April 18, 2026
పెంచలకోన వార్షిక బ్రహ్మోత్సవాలు వివరాలు ఇవే…

రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
28: ధ్వజారోహణం, శేష వాహ సేవ
29: బంగారు హనుమంత సేవ
30: బంగారు గరుడసేవ
1: కళ్యాణోత్సవం, రథోత్సవం
2: వసంతోత్సవం, అశ్వవాహన సేవ
3: గోనుపల్లిలో గ్రామోత్సవం, పల్లకి సేవ
భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.


