News March 12, 2025

ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు చర్యలు: బాపట్ల కలెక్టర్ 

image

ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులను, సీనియర్ నాయకులను ఆహ్వానిస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్థాయిలో ఏవైనా పరిష్కరించని సమస్యల ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 30 వ తేదీ నాటికి అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి భారత ఎన్నికల సంఘం సూచనలను ఆహ్వానిస్తుందన్నారు.

Similar News

News March 21, 2025

MNCL: స్కాలర్షిప్.. APPLY NOW

image

2025 సంవత్సరంలో ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం డిగ్రీ పూర్తయినా లేదా చివరి ఏడాది చదువుతున్న వారు మే 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు https://telanganaepass.cgg.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News March 21, 2025

MBNR: టెన్త్ పరీక్షలు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా!

image

టెన్త్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ✔MBNR:60 పరీక్ష కేంద్రాలు-13,038 మంది విద్యార్థులు ✔NRPT:39 పరీక్ష కేంద్రాలు-7,631 మంది విద్యార్థులు ✔NGKL: 60 పరీక్ష కేంద్రాలు-10,598 మంది విద్యార్థులు ✔GDWL: 40 పరీక్ష కేంద్రాలు-7,717 మంది విద్యార్థులు ✔WNPT:36 పరీక్ష కేంద్రాలు-6,853 మంది విద్యార్థులు >ALL THE BEST!!

News March 21, 2025

KMR: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి జిల్లా లోని వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా డీసీహెచ్ఎస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బాన్సువాడ, దోమకొండ, మద్నూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో 19 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తామన్నారు.

error: Content is protected !!