News March 18, 2024
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు: కలెక్టర్

వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. అలా ఎవరైనా ప్రచారంలో పాల్గొంటే టోల్ ఫ్రీ నెంబర్: 1800 425 7755కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 23, 2025
సీమ అభివృద్ధికి సత్య సాయిబాబా కృషి: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కర్నూలు ఎంపీ నాగరాజు, కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సత్య సాయిబాబా రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
News November 23, 2025
అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్స్పీడ్–ఓవర్లోడ్ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.
News November 23, 2025
నిబద్ధత, సేవ భావంతో సేవలు అందించాలి: కలెక్టర్

ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చే విధంగా నిబద్ధతతో సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థల శిక్షణ పొందుతున్న 16 మంది యువ ఐపీఎస్, యువ ఐఏఎస్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. పరిపాలనలో మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు.


