News March 21, 2024
ఎన్నికల ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి: కృష్ణా కలెక్టర్

సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC)ని ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీ  ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు
పెయిడ్ న్యూస్ను పర్యవేక్షిస్తుందన్నారు. 
Similar News
News October 30, 2025
కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.
News October 30, 2025
కోడూరు: పవన్ పంట పొలాలను పరిశీలించే స్థలం ఇదే.?

తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కోడూరు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపురం ఆర్సీఎం చర్చి వద్ద తుపాన్ తాకిడికి నేలకి వోరిగిన వరిపైరును పరిశీలించనున్నారు. వ్యవసాయ అధికారులు తుపాన్ నష్టాన్ని అంచనా వేసి పవన్కి వివరించనున్నారు. పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News October 30, 2025
అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోడూరు మండలంలో పర్యటించనున్నట్లు ఏపీ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 8:30 గంటలకు నాగాయలంకలో, 10:30 గంటలకు కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన ప్రకటనలో వివరించారు.


