News March 21, 2024

ఎన్నికల ప్రధానాధికారి ముందుకు నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) ముఖేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 4గం.లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలన్నారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేదని..? విచారణలో ఏం తేలింది.? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఎస్పీని CEO ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎస్పీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని CEO తెలిపారు.

Similar News

News December 19, 2025

సుపరిపాలన వారోత్సవాలు ప్రారంభం: కలెక్టర్

image

ఈ నెల 25 వరకు జిల్లాలో సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. ‘గ్రామాల వైపు పరిపాలన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌తో పాటు అన్ని రెవెన్యూ డివిజన్, మండల కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News December 18, 2025

‘మాతృ మరణాల నివారణే లక్ష్యం’

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్.భాస్కర్ అధ్యక్షతన డీఎంహెచ్ఓ కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్షా సమావేశం (MDSR) జరిగింది. బిడ్డకు జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదని, ప్రసవ సమయంలో శిశు మృతులు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గర్భిణికి 12 వారాల్లోపు వైద్య పరీక్షలు పూర్తి చేయాలన్నారు. హైరిస్క్ గర్భవతులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని సూచించారు.

News December 18, 2025

కలెక్టర్ల సదస్సులో సిరి, ఎస్పీ

image

రాష్ట్ర సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కొనసాగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సదస్సులో కర్నూలు జిల్లా నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న పరిపాలనా కార్యక్రమాలు, శాంతిభద్రతల అంశాలపై చర్చించారు. జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.