News March 21, 2024
ఎన్నికల ప్రధానాధికారి ముందుకు నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డికి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) ముఖేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సాయంత్రం 4గం.లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలన్నారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేదని..? విచారణలో ఏం తేలింది.? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఎస్పీని CEO ముఖేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎస్పీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని CEO తెలిపారు.
Similar News
News September 11, 2024
నంద్యాల: 63 రోజులుగా కనిపించని బాలిక ఆచూకీ
పగిడ్యాల మండలం ముచ్చుమర్రి బాలిక ఆచూకీ 63 రోజులైనా తెలియకపోవడం దారుణమని ఎంవీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి కొండన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి నంద్యాల మండలం హెచ్.కొట్టాల, కానాల, ఎం.చింతకుంట, తదితర గ్రామాల్లో పర్యటించి వాల్మీకి యువతతో సమావేశమయ్యారు. ముచ్చుమర్రి బాలిక హత్యాచారానికి గురైందని తెలిసి 63 రోజులైనా ఎటువంటి ఆనవాళ్లూ దొరకలేదని, ఈ ఘటనను అధికారులు పూర్తిగా వదిలేశారని వాపోయారు.
News September 11, 2024
ఎమ్మెల్యే 3 నెలల వేతనం విరాళం
సీఎం సహాయ నిధికి తన 3 నెలల వేతనం రూ.5 లక్షలు, గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు ఇచ్చిన మరో రూ.5 లక్షల విరాళంతో కలిపి మొత్తం రూ.10 లక్షలు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సీఎం చంద్రబాబుకు అందజేశారు. అనంతరం విజయవాడలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తనకు కేటాయించిన వార్డులో పర్యటించి, వారి కష్టాలు తెలుసుకున్నారు.
News September 11, 2024
దాతలు ముందుకు రావడం అభినందనీయం: మంత్రి భరత్
వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి టీజీ భరత్ అన్నారు. అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ వరద బాధితులను ఆదుకునేందుకు రూ.25 లక్షలు అందించింది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు భరత్‌ను కలిసి చెక్కును అందించారు. మంత్రి మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని చెప్పారు.