News January 31, 2025
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: BHPL ఎస్పీ

పట్టభద్రులు & ఉపాధ్యాయ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, జిల్లా పరిధిలో అభ్యర్థులు, ప్రజలు, రాజకీయ నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, అందరూ పాటించాలని, ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరారు.
Similar News
News December 6, 2025
HYD: ఓఆర్ఆర్పై ఏఐ కెమెరాలతో నిఘా.!

ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. వీటి ద్వారా డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోనున్నారు. ఏఐ కెమెరాలు వీటిని పసిగట్టి పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందిస్తాయి. తద్వారా ప్రమాదాలు తక్కువయ్యే అవకాశం ఉంది.
News December 6, 2025
కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో నవంబర్ 2025లో నిర్వహించిన బీ-ఫార్మసీ 7వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 11వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి. వీరబ్రహ్మచారి సూచించారు.
News December 6, 2025
చిన్న చీమ పెద్ద మనసు.. చావడానికీ వెనుకాడదు!

కష్టం, క్రమశిక్షణకు మారుపేరైన చీమల గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. తీవ్రంగా జబ్బుపడిన చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాయని ఆస్ట్రియా పరిశోధకుల స్టడీలో తేలింది. అనారోగ్యానికి గురైనవి రసాయన వాయువు రిలీజ్ చేసి ‘డేంజర్’, ‘నన్ను చంపండి’ అనే సిగ్నల్ ఇస్తాయని సైంటిస్టులు చెప్పారు. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆ చీమ గూడును ఇతర చీమలు చీల్చివేస్తాయని తెలిపారు.


