News April 29, 2024

ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి: కలెక్టర్

image

రాజకీయ పక్షాలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. ఓట్లను పొందటం కోసం కులం, మత పరమైన భావాల పరంగా అభ్యర్థనలు చేయరాదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చీలు, దేవాలయాలు లేక మరే ఆరాధనా ప్రదేశాలనూ వేదికగా ఉపయోగించకూడదన్నారు. నాయకులు, కార్యకర్తల వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయరాదన్నారు.

Similar News

News October 30, 2025

నవంబర్ 7న రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక

image

నవంబర్ 7న రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ సభ్యులంతా తప్పక హాజరు కావాలన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నూతన మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

News October 30, 2025

గోకవరం: ముంపు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్

image

గోకవరం మండలంలోని ముంపునకు గురైన కృష్ణుని పాలెం, సంజీవయ్య నగర్ కాలనీల మధ్య ప్రాంతాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం సందర్శించారు. ముంపు వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణుని పాలెం, సంజీవయ్య నగర్ మధ్య ఉన్న ఊర కాలువ వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పాల్గొన్నారు.

News October 30, 2025

ఉద్యాన రైతును దెబ్బ కొట్టిన మొంథా తుఫాన్

image

జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో 1,860 మంది రైతులకు చెందిన 2738.73 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యాన అధికారి మల్లికార్జునరావు తెలిపారు.170.33 ఎకరాల్లో కూరగాయ పంటలు,62.19 ఎకరాల్లో బొప్పాయి, రెండున్నర ఎకరాల్లో పూల తోటలు,5.92 జామ, 2491 అరటి, రెండున్నర ఎకరాల్లో తమలపాకు, 3.35 ఎకరాల్లో పచ్చిమిర్చి పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు.