News May 20, 2024
ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు 144 సెక్షన్: ఎస్పీ
ఎన్నికలు తుది ఫలితాలు వరకు 144 సెక్షన్, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని శ్రీకాకళం ఎస్పీ జి.ఆర్ రాధిక అన్నారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నమోదైన కేసుల దర్యాప్తు, ముద్దాయిలు అరెస్టు, ప్రాపర్టీ సీజ్ తదితర అంశాలపై ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీకెట్లు నియమించాలని సూచించారు.
Similar News
News December 8, 2024
పాలకొండ: చెక్కుబౌన్స్ కేసులో ముద్దాయికి జైలు శిక్ష
విక్రమపురం గ్రామానికి చెందిన ఖండాపు విష్ణుమూర్తికి బాకీ తీర్చే నిమిత్తం పాలకొండ గ్రామానికి చెందిన కింతల సంతోష్ రూ.9.80.లక్షల చెక్కును అందజేశారు. ఆ చెక్కు బౌన్స్‌తో విష్ణుమూర్తి పాలకొండ కోర్టులో కేసు వేశారు. కోర్టు విచారణలో ముద్దాయి నేరం ఋజువు కావడంతో స్థానిక జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సదరు ముద్దాయి సంతోష్‌కు ఒక్క సంవత్సరం జైలు శిక్షను, చెక్కు మొత్తాన్ని నష్టపరిహారంగా ఇవ్వాలని తీర్పు చెప్పారు.
News December 7, 2024
శ్రీకాకుళం: పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి
చదువుకుంటున్న పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ప్రతి రోజు కనిపెడుతూ ఉండాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీ పేటలో స్థానిక అందవరపు వరహా నరసింహం (వరం )హైస్కూల్ నందు శనివారం ఉదయం జరిగిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదకద్రవ్యాలు వద్దు బ్రో అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
News December 7, 2024
శ్రీకాకుళం: ప్రాణం తీసిన ఇన్‌స్టా చాటింగ్
విశాఖ పీఎంపాలెంలో నిన్న ఒకరు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం పట్టణానికి చెందిన హేమంత్ రెడ్డికి 2017లో వివాహం జరిగింది. డెలీవరీ బాయ్‌గా పనిచేసే అతడు భార్య(25)తో కలిసి పీఎంపాలెంలో ఉంటున్నారు. భార్య శుక్రవారం ఇన్‌స్టాగ్రాంలో ఒకరితో చాటింగ్ చేయడాన్ని గమనించి గొడవ పడ్డారు. ఈ విషయం అత్తమామలకు తెలిసి మందలించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.