News March 30, 2024
ఎన్నికల బరిలో ఐదుగురు నరసరావుపేట అభ్యర్థులు

పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఐదుగురు టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేయటం సంచలనం రేకెత్తిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను రాజకీయంగా శాసించిన నరసరావుపేట నేతలు తమకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, గురజాల శాసనసభ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Similar News
News November 27, 2025
అమరావతి: ‘రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సహకరిస్తాం’

CM చంద్రబాబుతో సమావేశం సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడారు. రాజధాని కోసం JACలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించామని, ఇక అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటామన్నారు. 2వ విడత భూసమీకరణకు పూర్తిగా సహకరిస్తామని, CM రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తమకు మేలు జరుగుతుందని, ల్యాండ్ పోలింగ్‌కు ఇవ్వని వారిని పిలిపించి మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు.
News November 27, 2025
పోలీసు కుటుంబాలకు అండగా గుంటూరు ఎస్పీ

గుంటూరు AR హెడ్ కానిస్టేబుల్ షేఖ్ మొహిద్దిన్ బాషా కుమారుడు షేఖ్ ఆఖ్యార్ అహ్మద్ సాఫ్ట్ టెన్నిస్‌లో దేశస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. శ్రీకాకుళంలో అండర్-17 టోర్నమెంట్‌లో ప్రథమ స్థానం సాధించిన అతనికి ఎస్పీ వకుల్ జిందాల్ ప్రోత్సాహకంగా రూ. 20 వేల విలువైన టెన్నిస్ బ్యాట్ అందజేశారు. పోలీసు కుటుంబం నుంచి జాతీయ స్థాయికి చేరడం గర్వకారణమని ఎస్పీ పేర్కొంటూ, భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.
News November 27, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు ధరలు నిలకడగా ఉన్నాయి. క్వింటాల్ పసుపు గరిష్ఠంగా రూ. 12,700 ధర పలికింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపు కొమ్ముల ధర రూ. 9 వేల నుంచి రూ. 12,700 వరకు, కాయ రకం పసుపు ధర రూ. 9,300 నుంచి రూ. 12,190 వరకు పలికాయి. మార్కెట్‌లో మొత్తం మీద పసుపు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.


