News March 30, 2024

ఎన్నికల బరిలో ఐదుగురు నరసరావుపేట అభ్యర్థులు

image

పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి ఐదుగురు టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేయటం సంచలనం రేకెత్తిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను రాజకీయంగా శాసించిన నరసరావుపేట నేతలు తమకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, గురజాల శాసనసభ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Similar News

News April 15, 2026

టీడీపీ రాష్ట్ర కమిటీలో గుంటూరు నేతలకు ప్రాధాన్యం

image

టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీల్లో గుంటూరు జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవిని పొలిట్ బ్యూరోగా నియమించారు. తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, కల్పటపు బుచ్చి రాంప్రసాద్, వీఆర్ శ్రీలక్ష్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. దాసరి ఉదయశ్రీ యాదవ్, తాడిశెట్టి మురళి సహా పలువురికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో చోటు కల్పించారు.

ఇంటర్ ఫలితాల్లో సత్తా గుంటూరు జిల్లా స్టూడెంట్స్

image

<<19653702>>ఇంటర్ ఫలితాల్లో<<>> గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 33,643 మందికి 29,530 మంది పాసయ్యారు. 88 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 30,551 మంది పరీక్షలు రాయగా 26,856 మంది పాసయ్యారు. 88 శాతం పాస్ పర్సంటేజీతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది.