News May 3, 2024
ఎన్నికల బరిలో ముగ్గురు రిటైర్డ్ IASలు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పోటీలో ఉన్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కొప్పుల రాజు కాంగ్రెస్ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఉండగా, తిరుపతి ఎంపీ బరిలో వెలగపల్లి వరప్రసాద్, విజయకుమార్ ఉన్నారు. వరప్రసాద్ నాలుగోసారి ఎన్నికల సంగ్రామంలో ఉండగా విజయకుమార్ మొదటి సారి పోటీ చేస్తున్నారు.
Similar News
News November 2, 2024
4 నుంచి SMP పరీక్షలు: నెల్లూరు DEO
సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్-2 (SMP) పరీక్షలు ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు నెల్లూరు డీఈవో ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా ప్రశ్నపత్రాలు అందజేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సొంత ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
News November 2, 2024
నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 30 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సివిల్ సప్లయిస్ సంస్థ డీఎం నర్సింహరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ 37,978 ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. 1,29,583 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం 2024-25 సీజన్‌కు గ్రేడ్-ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరగా ప్రకటించిందన్నారు.
News November 2, 2024
హైదరాబాద్‌లో నెల్లూరు వ్యక్తి మోసం
ఇంటి స్థలం పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. నెల్లూరుకు చెందిన కంచర్ల సతీశ్ చంద్రగుప్తా HYDలోని రాయదుర్గంలో ఉంటున్నాడు. సాయి సూర్య డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడే ఓ స్థలానికి ఫేక్ పేపర్స్ సృష్టించాడు. గోపాల్ రెడ్డికి రూ.3.25 కోట్లకు ప్లాట్ ఇస్తానని చెప్పి రూ.1.45కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరగడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.