News May 12, 2024
ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన వారిపై కేసులు

నల్గొండ : ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు నమోదు చేయాలని నల్గొండ కలెక్టర్ హరిచందన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసు బుక్ చేయాలని సూచించారు. పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు.
Similar News
News November 7, 2025
దామరచర్ల: పత్తి చేనులో పుర్రె, ఎముకలు

దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. పత్తి తెంపడానికి వచ్చిన కూలీలు పుర్రె, ఎముకలు చూసి పొలం యజమానికి తెలపడంతో యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 7, 2025
నల్గొండలో ర్యాగింగ్పై కలెక్టర్ ఆరా

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆరా తీశారు. ఆమె అదనపు కలెక్టర్, ఆర్డీఓతో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపల్తో విడివిడిగా మాట్లాడిన కలెక్టర్, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నట్లు చర్చల్లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.
News November 7, 2025
NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.


