News February 21, 2025
ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓ, ఓపీఒ, మైక్రోఅబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి మాట్లాడారు. ఏ ఒక్కరికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు లేదని అందరు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
Similar News
News December 17, 2025
వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..!

జిల్లా వ్యాప్తంగా మూడో విడత సర్పంచి ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా నమోదైంది. నర్సంపేట మండలంలో 57.62 శాతం, ఖానాపురం మండలంలో 44.88 శాతం పోలింగ్ జరిగింది. చెన్నారావుపేట మండలంలో 64.86 శాతం, నెక్కొండ మండలంలో 63.3 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుండగా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News December 17, 2025
ములుగు: 11 గంటల వరకు 60.64% పోలింగ్ నమోదు

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 11 గంటల వరకు 60.64% ఓట్లు పోలయ్యాయి. కన్నాయిగూడెం మండలంలో 64.91%, వెంకటాపురం మండలంలో 60.10%, వాజేడు మండలంలో 59.35% పోలింగ్ నమోదయింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
News December 17, 2025
11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


