News February 24, 2025
ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఈ నెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కలెక్టర్ కాటారం, భూపాలపల్లి డివిజన్లు పీఓ, ఎపీఓలకు రెండో విడత శిక్షణా కార్యక్రమం కలెక్టర్ నిర్వహించారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ముందురోజే చేరుకుని, ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, ఎలక్షన్ సామగ్రిని పరిశీలించుకోవాలన్నారు.
Similar News
News September 18, 2025
జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్‌తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.
News September 18, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి సుభాష్ భేటీ

వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఆయన ఛాంబర్లో గురువారం కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. పంచాయితీరాజ్ శాఖతో కార్మికశాఖకు ముడిపడి ఉన్న అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి ప్రస్తావించారు. వీటిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
News September 18, 2025
విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.