News June 3, 2024
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్: డీకే బాలాజీ
మచిలీపట్నంలో కృష్ణ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి సోమవారం జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రత్యేక సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్లో పాల్గొని సిబ్బందిని తేలికగా గుర్తించేలా ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశారు. మీడియాకు సమాచారాన్ని చేరవేయడంలో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.
Similar News
News September 13, 2024
పారదర్శకంగా బదిలీలు నిర్వహించాం: ఎస్పీ
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు కృష్ణా జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసుల బదిలీలు నిర్వహించామని ఎస్పీ ఆర్. గంగాధర్ తెలిపారు. శుక్రవారం 135 మంది మహిళా పోలీసుల బదిలీల ప్రక్రియను తన కార్యాలయంలో నిర్వహించామని ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న చోటుకే బదిలీలు చేశామని ఆయన స్పష్టం చేశారు.
News September 13, 2024
కృష్ణా: NSG జాబితాలో ఉన్న రైల్వే స్టేషన్లివే
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రైల్వే స్టేషన్లలో ఆరు స్టేషన్లు NSG(నాన్ సబర్బన్ గ్రూపు) జాబితాలో చోటు దక్కించుకున్నాయి. రాయనపాడు, రామవరప్పాడు స్టేషన్లు NSG-5 కేటగిరిలో చోటు సంపాదించగా, కొండపల్లి, మధురానగర్, నిడమానూరు, గన్నవరం స్టేషన్లు NSG-6 ప్రపోజల్ కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి. కాగా రూ.528 కోట్ల రెవిన్యూతో విజయవాడ స్టేషన్ NSG-1 గుర్తింపు దక్కించుకుంది.
News September 13, 2024
ఆయుధాగారాన్ని తనిఖీ చేసిన ఎస్పీ గంగాధర్
ఎస్పీ ఆర్. గంగాధర్ శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయుధాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా ఆయన అక్కడి ఆయుధాలను స్వయంగా పరిశీలించారు. ఆర్మోరర్ వర్క్ షాప్, యాంటీ రోయిట్ సామాగ్రి, మందు గుండు సామాగ్రి యొక్క నిర్వహణ, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఎస్పీ.. ఆయుధాగార నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు.