News April 6, 2024
ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి: గుంటూరు SP తుషార్
జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్, కంట్రోల్ రూమ్ విభాగాలను శుక్రవారం ఎస్పీ తుషార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు ఐటి కోర్ బృందంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. డయల్ 100కు కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి అప్రమత్తం చేయాలన్నారు.
Similar News
News January 26, 2025
ఉండవల్లిలో సీఎం నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎం చంద్రబాబు ఎగురవేశారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
News January 26, 2025
గుంటూరు జిల్లాలో నేడు ఆ రెండు బంద్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావడంతో మందు, ముక్కతో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
News January 26, 2025
ANU: వన్ టైం ఆపర్చునిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ విద్యార్థులకు రెగ్యులర్, సప్లమెంటరీలతో పాటు 4వ సెమిస్టర్ లో వన్ టైం ఆపర్చునిటీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఈ ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 20లోగా ఫీజులు చెల్లించాలన్నారు. రూ.100 అపరాదంతో ఫిబ్రవరి 24లోపు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఫీజుల వివరాలు, పరీక్షల షెడ్యూల్ www.anu.ac.in వెబ్ సైట్ నుంచి పొందవచ్చుని తెలిపారు.