News April 3, 2024
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే కఠిన చర్యలు: కలెక్టర్

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రిసైడింగ్ అధికారులు 100 శాతం ఎన్నికల శిక్షణకు హాజరు కావాలని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. హాజరు కాని సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొనేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఎవరైతే శిక్షణకు గైర్హాజరవుతారో వారిపై పోలీస్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు
Similar News
News December 4, 2025
నెల్లూరులో వరినాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్నాయ్..!

నెల్లూరు జిల్లాలోని వరి నాట్లు కళ్ల ముందే కొట్టుకుపోతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 11 మండలాల పరిధిలోని 71 గ్రామాల్లో 1,169 హెక్టార్లలో నాట్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 1,775 మంది రైతులు నష్ట పోయారన్నారు. భారీ వర్షాల వల్ల బోగోలు, విడవలూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, అల్లూరు, వెంకటాచలం, బుచ్చి, సంగం, మనుబోలు మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
News December 4, 2025
పవన్ కళ్యాణ్‌కు మంత్రి ఆనం సూచన ఇదే..!

ఆత్మకూరు అభివృద్ధికి తాను ఏమి అడిగినా అన్ని ఇచ్చారని Dy.CM పవన్ కళ్యాణ్‌ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొనియాడారు. ఆత్మకూరులో కొత్త DDO ఆఫీస్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘ఒకేసారి 77ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాత భవనాల్లో DDO ఆఫీసులు పెట్టారు. ఒకే మోడల్‌తో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బిల్డింగ్లు కట్టించండి’ అని ఆనం కోరగా ఆలోచన చేస్తామని పవన్ చెప్పారు.
News December 4, 2025
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


