News March 24, 2024

ఎన్నికల సంఘం నిబంధనలు అమలు చేయాలి: ఎస్పీ

image

జిల్లాలోని పోలీసు అధికారులందరూ ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చెక్పోస్టుల్లో నగదు, అక్రమ మద్యం, గంజాయి రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు.

Similar News

News November 2, 2024

నదీ తీర ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుండే శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, వంకలు, చెరువులలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లే భక్తులకు కర్నూలు ఎస్పీ కీలక సూచనలు చేశారు. తమ వెంట చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలను తీసుకొని వెళ్తే.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలులో కార్తీక దీపాలు వదిలే వినాయక్ ఘాట్, ఓర్వకల్లు శ్రీ కాల్వబుగ్గ రామేశ్వరం శివాలయం, తదితర చోట్ల భక్తుల జాగ్రత్తగా ఉండాలన్నారు.

News November 1, 2024

రూ.2,800 కోట్లతో ఓర్వకల్ పారిశ్రామిక వాడ అభివృద్ధి: మంత్రి భరత్

image

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2,800 కోట్లతో ఓర్వకల్ పారిశ్రామిక వాడ అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూపర్ 6 హామీల అమలులో భాగంగా దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నాగరాజు, జాయింట్ కలెక్టర్ బీ.నవ్య పాల్గొన్నారు.

News November 1, 2024

దీపం-2 పథకం ద్వారా పేదల జీవితంలో వెలుగులు: మంత్రి

image

సీఎం చంద్రబాబు దీపం-2 పథకం ద్వారా పేదల జీవితంలో వెలుగులు నింపుతున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో దీపం పథకం-2 (ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు, జాయింట్ కలెక్టర్ బీ.నవ్య పాల్గొన్నారు.