News May 12, 2024

ఎన్నికల సామగ్రి తరలింపులో అజాగ్రత వద్దు:కలెక్టర్‌

image

ఎన్నికల్లో పోలింగ్‌కు అవసరమైన సామగ్రి తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సూచించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్‌ రూమ్‌ను‌ పరిశీలించారు. ఈవీఎంల తరలింపు, తదితర అంశాలపై ఆరా తీశారు.

Similar News

News December 24, 2025

ఖమ్మం: సర్పంచ్‌లకు ‘పంచాయతీ’ పాఠాలు

image

ఖమ్మం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా నుంచి ఎంపికైన 33 మంది అధికారులు శిక్షణ పొంది, అనంతరం సర్పంచ్‌లకు విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జిల్లా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 24, 2025

ఖమ్మం గజగజ

image

ఖమ్మం జిల్లాలో ‘చలిపులి’ పంజా విసురుతోంది. గత పది రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు వల్ల వాహనదారులు,మున్సిపల్ కార్మికులు, పాలు,కూరగాయల విక్రేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి ధాటికి వృద్ధులు, పిల్లలు అల్లాడుతుండగా పొలాల వద్ద రైతులు చలిమంటలే శరణ్యమంటున్నారు. రానున్న 3రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News December 24, 2025

ఖమ్మం: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో-ఆర్డినేటర్ వెంకటేశ్వరరావు తెలిపారు. 5వ తరగతితో పాటు, 6 నుంచి 9 తరగతుల్లో ప్రవేశం కోరే విద్యార్థులు వచ్చే ఏడాది జనవరి 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ రుసుము రూ.100 చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.