News May 12, 2024
ఎన్నికల సామగ్రి తరలింపులో అజాగ్రత వద్దు:కలెక్టర్

ఎన్నికల్లో పోలింగ్‌కు అవసరమైన సామగ్రి తరలింపులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా విధులు నిర్వహించాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఈవీఎంల తరలింపు, తదితర అంశాలపై ఆరా తీశారు.
Similar News
News July 5, 2025
అత్యధికంగా ఖమ్మం రూరల్.. అత్యల్పంగా మధిర

ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే పెరిగింది. గతేడాది 66,288 మంది ఉండగా, ఈ ఏడాది 68,175కు చేరింది. 1,887 మంది విద్యార్థులు పెరిగారు. అత్యధికంగా KMM (R) 359 మంది, అతి తక్కువగా మధిరలో ఆరుగురు పెరిగారు. కూసుమంచి 318, KMM (U)18, SPL 167, పెనుబల్లి 121, సింగరేణి 158, బోనకల్ 104, కల్లూరు 105, ఎర్రుపాలెం 91, ఏన్కూరు 75, ముదిగొండ 63, తల్లాడ 15, కామేపల్లిలో 11 మంది పెరిగారు.
News July 5, 2025
ఖమ్మం జిల్లాలో ముగిసిన కళాశాలల బంద్

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో ఈనెల 3, 4న PDSU తలపెట్టిన 48 గంటల కళాశాలల బంద్ శుక్రవారం నాటికి ముగిసింది. బంద్ సందర్భంగా ఖమ్మం కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల ముందు PDSU నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్యలు మాత్రం తీరడం లేదని దుయ్యబట్టారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News July 4, 2025
వరద విపత్తుల నిర్వహణకు సిద్ధం: ఖమ్మం కలెక్టర్

వరద విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా విపత్తుల నిర్వహణపై సమావేశమయ్యారు. గత సంవత్సరం వచ్చిన భారీ వరదలు, విపత్తుల నిర్వహణ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లు, ప్రణాళిక తదితర అంశాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.