News February 6, 2025
ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ సత్తా చాటాలి: రేగా కాంతారావు
ఇల్లందు: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సత్తా చాటాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇలా ఏ ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News February 6, 2025
KMM: 1,04,995 మందికి రైతు భరోసా నిధులు జమ
తెలంగాణ ప్రభుత్వం యాసంగి సాకు కింద రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాలు, గ్రామాల వారీగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న రైతుల ఖాతాలో నగదు జమ చేసింది. ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న 1,04,995 మంది రైతుల ఖాతాలలో రూ.58,22,56,809 జమయ్యాయి. గతంలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున అందిస్తుండగా, ప్రస్తుతం రూ.6 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
News February 6, 2025
వేములవాడ: రాజన్న సేవలో జబర్దస్త్ నటులు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని గురువారం జబర్దస్త్ నటులు సుడిగాలి సుదీర్, ఆటో రామ్ ప్రసాద్లు దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు.
News February 6, 2025
‘తల్లికి వందనం’పై సీఎం కీలక ప్రకటన
AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.