News March 16, 2025
ఎన్నో రూపాల్లో మోసాలు జరుగుతాయి: ఎస్పీ

బ్యాంకులు, ప్రభుత్వ సంస్థ, ఇతర విశ్వసనీయ సంస్థల నుంచి వచ్చినట్లుగా నమ్మించి నకిలీ ఈ మెయిల్‌లు, సందేశాలు పంపి మోసగిస్తారని, ఈ మోసాలు వివిధ రూపాల్లో జరుగుతాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అనుమానాస్పదమైన ఈ మెయిల్ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలను అడిగే అభ్యర్థనలను బాగా గమనించండి. వెబ్‌సైట్‌ల URLలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.
Similar News
News April 21, 2025
నెల్లూరు కలెక్టరేట్‌లో ఉచిత భోజనం

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వీరికి కలెక్టర్ ఓ.ఆనంద్ ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
News April 21, 2025
చెట్లకు చికిత్స అందిస్తున్నారు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మనుషులకు, జంతువులకు డాక్టర్లు ఉండటం చూశాం. కానీ, చెట్ల ఆరోగ్యం కోసం పంజాబ్‌కు చెందిన IRS అధికారి రోహిత్ మిశ్రా పాటుపడుతున్నారు. ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రీ క్లినిక్‌ను స్థాపించగా దీనికి ప్రత్యేకమైన అంబులెన్స్ కూడా ఉంది. ఇందులోని రకరకాల ఆయుర్వేదిక్, ఆర్గానిక్ మందులు మొక్కలకు వచ్చే సమస్యలకు చెక్ పెడతాయని తెలిపారు. అడవిలోని వేలాది మొక్కలకు ఆయన పునర్జన్మనిచ్చారు.
News April 21, 2025
మళ్లీ కలవనున్న ఠాక్రే సోదరులు

హిందీ వ్యతిరేక ఉద్యమంతో మహారాష్ట్ర కజిన్స్ కలుస్తున్నారు. అన్నదమ్ముల పిల్లలైన ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-UBT), రాజ్ ఠాక్రే (మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన) 20 ఏళ్లుగా సొంత పార్టీలు నడుపుతున్నారు. స్కూళ్లలో హిందీని తప్పక బోధించాలన్న MH ప్రభుత్వ నిర్ణయాన్ని ఇద్దరూ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలకై ఉద్ధవ్‌తోనూ కలిసి ఉద్యమిస్తానని MNS చీఫ్ ఇటీవల ప్రకటించగా మాజీ సీఎం కూడా ఓకే అన్నట్లు తాజాగా సిగ్నలిచ్చారు.