News April 30, 2024

ఎన్సీడీ నిర్వహణపై వైద్య సిబ్బందికి అవగాహన

image

గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం లకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు ఎన్సీడీ పోర్టల్ లో లింక్ చేసే విధానంపై డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ రాజు మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు అబా కార్స్ లింక్ చేసిన తర్వాత వారి సంఖ్యను జిల్లా ఆరోగ్య కేంద్రానికి తెలపాలన్నారు. ప్రాక్టికల్ గా ట్యాబ్ లో అబా కార్స్ లింక్ చేశారు.

Similar News

News November 6, 2024

MBNR: లండన్‌లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు

image

లండన్ నగరంలో 7, 8 తేదీలలో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వెళ్లారు. నల్లమలలోని ప్రకృతి పర్యటక ప్రాంతాలపై, కృష్ణానది పరవళ్లు, పర్యాటకులను ఆకర్షిస్తాయని వివరించారు.

News November 6, 2024

8 తేదీన కొండారెడ్డిపల్లి గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి 

image

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి ఈ నెల 8 తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వంత గ్రామంలో నిర్మిస్తున్న ఆలయ ప్రారంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

News November 6, 2024

జడ్చర్ల: అమ్మాయి అనుకున్నారు.. కానీ ట్రాన్స్‌జెండర్‌

image

ట్రాన్స్‌జెండర్‌ని యువకులు అపహరించే ప్రయత్నం చేసిన ఘటన జడ్చర్ల బస్టాండులో జరిగింది. సోమవారం రాత్రి కొందరు యువకులు ట్రాన్స్‌జెండర్‌ను యువతి అనుకొని మభ్య పెట్టి బైక్‌పై ఎక్కించుకుని కొత్తపల్లి ఇసుక క్వారీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గమనించిన కొందరు వారిని అడ్డుకుని 100 సమాచారం అందించారు. పోలీసులకు అక్కడికి చేరుకుని ఆమె వివరాలు అడగగా నల్గొండ జిల్లాకి చెందినట్లుగా తెలిపింది. యువకులు పరారయ్యారు.