News January 17, 2025

ఎన్.గజపతినగరం: యువకుడి మృతి.. నిలిచిపోయిన గ్రామ తీర్థం

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ఎన్.గజపతినగరం గ్రామంలో యువకుని మృతితో గ్రామ దేవత తీర్థాన్ని నిలిపివేశారు. స్థానిక గ్రామానికి చెందిన వంటాకు శ్యాంప్రసాద్(21) బుధవారం పాడేరు మండలం ఐనాడ పంచాయతీ, గుల్లి గ్రామ సమీపంలోని జలపాతంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. ఈ విషాద వార్త విన్న ఆ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో గురువారం జరగాల్సిన గ్రామదేవత తీర్థాన్ని గ్రామం అంతా దూరమైంది.

Similar News

News October 24, 2025

‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందం రద్దు

image

సిరిపురంలోని ‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందాన్ని వీఎంఆర్డీఏ రద్దు చేసింది. నిర్దిష్ట సమయంలో డిపాజిట్ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందం కుదిరిన 15 రోజుల్లోపు అడ్వాన్స్ డిపాజిట్ చెల్లించాలి. మూడు నెలలు గడిచినా డిపాజిట్ చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో మూడో ఫ్లోర్ ఖాళీగా ఉంది. దీనికోసం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

News October 24, 2025

‘కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాలి’

image

కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సూపరింటెండెంట్ ఐ.వాణిని గురువారం కోరారు. 34 హెడ్ నర్సులు, 43 కాంట్రాక్ట్ నర్సులు, ట్రామా కేర్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సిబ్బంది పనిభారం అధికమై రోగుల సేవలో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

News October 23, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి, చుక్క రఘు రామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఇదే బెట్టింగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.