News June 3, 2024
ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా ఫలితాలు: విశాఖ కలెక్టర్
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వెంటనే రౌండ్ వారీ ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు కలెక్టర్ మల్లికార్జున సూచించారు. వెంటవెంటనే నిర్దేశిత వెబ్ సైట్లలో అప్లోడ్ చేయటంతో పాటు మీడియాకు కూడా ఫలితాలను ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు, సూచనలు సలహాలు ఇచ్చారు.
Similar News
News September 12, 2024
పరవాడ ఫార్మాసిటీలో విషాదం
పరవాడ ఫార్మాసిటీలో విషాదం నెలకొంది. ఎడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమంలో అదృశ్యమైన ఆర్.సూర్యనారాయణ మిథనాల్ ట్యాంకులో గురువారం శవమై కనిపించాడు. మంగళవారం విధులకు హాజరైన ఆయన తిరిగి ఇంటికి వెళ్లకపోవడం, ఫోన్‌కి అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఘటనపై విచారణ జరిపి మృతుని కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
News September 12, 2024
భీమిలి: ‘అక్రమ నిర్మాణాల సంగతి తేల్చండి’
భీమిలి బీచ్ సమీపంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాల సంగతి తేల్చాలని హైకోర్టు జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. భీమిలి బీచ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ కూడా నిర్మించారని దీనిపై జోక్యం చేసుకోవాలని జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
News September 12, 2024
వరద రాజకీయాలు ఎందుకు?: జడ్పి చైర్పర్సన్
ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓదార్చి ఆదుకోవడం బాధ్యత అని విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర అన్నారు. విశాఖ జడ్పీ అతిథి గృహంలో ఆమె మాట్లాడుతూ కూటమి నాయకులు ఆ బాధ్యతలను విస్మరించి వరద రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి చింతపల్లిలో చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.