News March 24, 2025
ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి

ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతుందంటూ MLC చంద్రశేఖర్ రెడ్డి వాపోయారు. 17 మంది వీసీలను బెదిరించి రాజీనామా చేయించడంపై ఆధారాలు ఇచ్చినా మంత్రి లోకేశ్ విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు రూ.5,252కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రజలు TDPని గెలిపించి బాధపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 31, 2025
నెల్లూరు : ఈ రోజు రాత్రి 12 గంటల వరకే..

ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రితో ముగియనుందని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత యథావిధిగా రబీ సీజన్కు సంబంధించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ బడుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులందరికీ తెలియజేసి ఏ విధమైన అంతరాయం లేకుండా అధికారులు చూడాలని సూచించారు.
News March 31, 2025
నెల్లూరు: కాకాణి విచారణకు వస్తారా?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాకాణికి నోటీసులు అందచేసేందుకు పొదలకూరు పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకి నోటీసులు అంటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఆయన విచారణకు వస్తారా లేదా అని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.
News March 31, 2025
సైదాపురం ఎంపీడీవోకు తప్పిన ప్రాణాపాయం

మనుబోలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురం ఎంపీడీవో పురుషోత్తం శివ కుమార్కు ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు ప్రయాణిస్తున్న కారును నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎంపీడీవోకు స్వల్ప గాయాలు కాగా సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.