News January 29, 2025
ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు దావత్ ఎందుకు: హరీశ్ రావు

ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు దావత్ ఎందుకని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X” వేదికగా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దావోస్ పెట్టుబడుల కట్టుకథలు నమ్మించే ప్రయత్నం చేసి అట్టర్ ప్లాప్ అయ్యారని విమర్శించారు. దావోస్ లో జరిగే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని, ఎవరైనా ఓపెన్ టెండర్లో రావాల్సిందే అన్నారు. పొంతనలేని లెక్కలు చెప్తున్నారని విమర్శించారు.
Similar News
News November 17, 2025
‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా పేరును జిల్లాకు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నామన్నారు.

రేపు భూపాలపల్లికి ఎంపీ కడియం కావ్య

రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అధ్యక్షతన దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ బాలకృష్ణ ఈరోజు తెలిపారు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసన సభ్యులు తదితరులు పాల్గొంటారని, కావున జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.