News January 29, 2025

ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు దావత్ ఎందుకు: హరీశ్ రావు

image

ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడు దావత్ ఎందుకని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ‘X” వేదికగా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దావోస్ పెట్టుబడుల కట్టుకథలు నమ్మించే ప్రయత్నం చేసి అట్టర్ ప్లాప్ అయ్యారని విమర్శించారు. దావోస్ లో జరిగే ఎంఓయూలు అన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని, ఎవరైనా ఓపెన్ టెండర్‌లో రావాల్సిందే అన్నారు. పొంతనలేని లెక్కలు చెప్తున్నారని విమర్శించారు.

Similar News

News February 19, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP NEWS

image

*జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
* విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దు: KMR కలెక్టర్
* మెరుగైన వైద్య సేవలు అందించాలి: బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
* లింగంపేట్ PS కు కొత్త సారొచ్చారు
*MLC ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి: మంత్రి జూపల్లి
* కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి 7ఏళ్ల శిక్ష..
* BJP నిరుద్యోగులను మోసం చేసింది: TPCC చీఫ్
* వసతుల కల్పనకు ప్రాధాన్యం: రైల్వే జీఎం

News February 19, 2025

వీణవంక: చలిమంట కాగుతుండగా ప్రమాదం.. మహిళ మృతి

image

ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధురాలు చనిపోయిన ఘటన వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. ఈనెల 12న ఉదయం చలిమంట కాగుతుండగా చీర కొంగుకి ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. పొట్టపై భాగాన కింది భాగాన పూర్తిగా కాలిపోవడంతో KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరమ్మ చనిపోయిందని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.

News February 19, 2025

CT తొలి మ్యాచ్.. పాకిస్థాన్ ఓటమి

image

CT-2025 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన NZ 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. 321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 47.2ఓవర్లకు 260 పరుగులు చేసి ఆలౌటైంది. బాబార్ ఆజమ్, కుష్‌దిల్ అర్ధశతకాలు చేశారు. విలియమ్, శాంట్నర్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. 23న భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ పాక్ ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.

error: Content is protected !!