News February 26, 2026

ఎప్‌స్టీన్ గదిలో షాకింగ్ ఫొటోలు, వస్తువులు

image

ఎప్‌స్టీన్ పారిస్ ఫ్లాట్‌కు సంబంధించిన షాకింగ్ ఫొటోలు బయటపడ్డాయి. 18 గదుల ఈ లగ్జరీ విల్లాలో గోడలకు వేలాడుతున్న నగ్న చిత్రాలు, సెక్స్ టాయ్స్, వింత జంతువుల డెకరేషన్ చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. హ్యూమన్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 2 కొత్త కేసులు ఫైల్ చేశారు. ఇక్కడే ఎప్‌స్టీన్ స్నేహితుడు జీన్ లూక్ బ్రూనెల్ అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Similar News

News April 16, 2026

పాడేరు: స్పాట్ వాల్యుయేషన్ పూర్తి

image

పాడేరు మండలం తలారిసింగ్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన టెన్త్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో 1,07,582 పేపర్స్ మూల్యాంకనం పూర్తి అయ్యిందని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ గురువారం తెలిపారు. 10 రోజుల పాటు 460 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. హిందీ, తెలుగు తప్ప మిగిలిన సబ్జెక్ట్ పేపర్స్ వాల్యుయేషన్ పూర్తి చేశామన్నారు. ఉన్నతాధికారులను సత్కరించారు.

జాన్వీకి ‘పెద్ది’ బూస్ట్ ఇస్తుందా?

image

బాలీవుడ్‌లో డజన్ సినిమాలు చేసిన జాన్వీకపూర్ తెలుగులో ఇప్పటివరకు చేసింది 2 సినిమాలే. 2018లో హీరోయిన్‌గా లాంచ్ అయిన ఈ బ్యూటీ తెలుగులో నటించేందుకు ఆరేళ్లు(2024) పట్టింది. జాన్వీ ‘దేవర’తో టాలీవుడ్‌‌కి ఎంట్రీ ఇచ్చారు. అందులో తన పాత్ర 2పాటలు, కొన్ని సీన్లకే పరిమితమైంది. ఆ తర్వాత తెలుగులో ‘పెద్ది’ తప్ప వేరే ఏ మూవీ చేయలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో శ్రీదేవి కూతురికి ‘పెద్ది’ మంచి బూస్ట్ ఇస్తుందేమో చూడాలి.