News August 26, 2024
ఎమ్మిగనూరులో ఇంద్రధనస్సు కనువిందు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. ఉదయం నుంచి ఎండ ఎక్కువగా ఉంటూ సాయంత్రం వేళ ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం కురిసిన తర్వాత ఇంద్రధనస్సు ఏర్పడి పట్టణవాసులకు కనువిందు చేసింది. ప్రజలు ఈ ఇంద్రధనస్సు చిత్రాలను తమ ఫోన్లలో బంధించారు.
Similar News
News October 20, 2025
నేడు పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయప్రయాసలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు.
News October 20, 2025
నేడు రద్దు: ఎస్పీ

News October 19, 2025
కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

కర్నూలు రేంజ్లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.