News February 27, 2025
ఎమ్మిగనూరులో చోరీ

ఎమ్మిగనూరులో భారీ చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తిరుమల నగర్‌కు చెందిన బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో బాధితులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. రూ.7లక్షల విలువైన బంగారం, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారని చెప్పారు.
Similar News
News October 20, 2025
NZB: CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం

CCS కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్‌ను పోలీసులు కాల్చడంతో పోలీసులపై, CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
News October 20, 2025
దీపాలు వెలిగించేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆనందకరమైన దీపావళి పండగను జరుపుకొనే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. దీపాలకు తగులుతాయి అనుకున్న కర్టెన్లను వీలైతే కొన్నిరోజుల పాటు తీసి పక్కన పెట్టేయండి. దుస్తులు దీపాలకు అంటకుండా చూసుకోవాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. పిల్లలు బాణసంచా కాలుస్తుంటే పక్కనే పెద్దవాళ్లు ఉండాలి. టపాసులు కాల్చేటపుడు షూ, కళ్లజోడు ధరించాలి. కాకర్స్‌ను దీపాలకు దూరంగా పెట్టుకోవాలి.
News October 20, 2025
రాష్ట్రంలో 97 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో వివిధ విభాగాల్లో 97 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వైద్య విద్య ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల సమాచారం కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.