News February 13, 2025

ఎమ్మిగనూరులో పర్యటించిన ఎస్పీ, మాజీ ఐజీ ఇక్బాల్

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల పాఠశాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ సందర్శించారు. ఇక్బాల్ మాట్లాడుతూ.. బాలికలకు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని, మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. బాలికలు పాఠశాలకు వస్తున్న సమయంలో గానీ, బయట గానీ ఎవరైనా ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 24, 2025

వైభవంగా శ్రీమన్యాయసుధ మంగళ మహోత్సవం

image

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శ్రీమన్యాయసుధా మంగళ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఇతర మఠాల పీఠాధిపతులతో కలిసి దీప ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా గంధాన్ని శోభాయాత్ర చేశారు. వేదికపై శ్రీమన్యాయసుధ విద్యార్థుల అనువాదం అనంతరం అంతర్ దృష్టితో కూడిన వాఖ్యార్థ ఘోష్టి నిర్వహించారు.

News March 23, 2025

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

image

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ భవన్ నందు ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షునిగా విద్యాసాగర్, సెక్రెటరీగా చంద్రమోహన్, కోశాధికారిగా సంధ్యా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై రాజు లేని పోరాటాలు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

News March 23, 2025

డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

image

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.

error: Content is protected !!