News October 2, 2024

ఎమ్మిగనూరులో 4న జాబ్ మేళా.. కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 4న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు MLA జయ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్, బీటెక్, డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 12, 2025

కర్నూలు: 75 మందికి బంగారు పతకాలు

image

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ జరిగే రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. ఇంజినీరింగ్‌లో 15, PGలో 60మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నారు. Phdలో 283, PGలో 889, డిగ్రీలో 17,224 మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 394 మందికి పట్టాలు ఇవ్వనున్నారు. RU ఏర్పడినప్పటి నుంచి జరిగిన 3 స్నాతకోత్సవాలను VCలే నిర్వహించారు. తొలిసారి 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరవుతున్నారు.

News November 11, 2025

గవర్నర్ కర్నూలు పర్యటన షెడ్యూల్ ఇదే..!

image

గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ కర్నూలు పర్యటన ఖరారయింది. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12న కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం నగరంలోని మాంటిస్సోరి విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆయన రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో కలిసి పాల్గొననున్నారు.

News November 11, 2025

తెలంగాణలో యాక్సిడెంట్.. కర్నూలు వాసి మృతి

image

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలులోని ఆర్ఆర్ నగర్‌కు చెందిన ఎన్. రఘు(43) మృతి చెందారు. చిలుకూరు మిట్స్ కాలేజీ సమీప హైవేపై సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సత్తుపల్లికి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, కోదాడ నుంచి హుజూర్నగర్ వెళ్తున్న బొలెరో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ రఘు మృతి చెందగా, పలువురు గాయాలపాలయ్యారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.